హైదరాబాద్, వెలుగు: గురుకుల విద్యాలయాలు, కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను ఈ నెల 24 నుంచి డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు www.treirb.telangana.gov.in ను చూడాలని సూచించారు. ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు ఉంటాయని గుర్తుచేశారు.
