V6 News

బీబీసీ అవార్డు రేస్‌‌‌‌లో హంపి, రాణి, మనూ

బీబీసీ అవార్డు రేస్‌‌‌‌లో హంపి, రాణి, మనూ

న్యూఢిల్లీ: ఇండియా చెస్​ క్వీన్​, తెలుగమ్మాయి  కోనేరు హంపి, హాకీ టీమ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ రాణి రాంపాల్‌‌‌‌, యంగ్‌‌‌‌ షూటర్‌‌‌‌ మనూ బాకర్‌‌‌‌.. బీబీసీ ‘ఇండియన్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ వుమెన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌’ అవార్డు రేస్‌‌‌‌లో నిలిచారు. అలాగే, వినేశ్‌‌‌‌ పోగట్‌‌‌‌, ద్యుతీ చంద్‌‌‌‌ను.. 40 మందితో కూడిన జ్యూరీ ప్యానెల్‌‌‌‌ మరోసారి నామినేట్‌‌‌‌ చేసింది. పబ్లిక్‌‌‌‌ ఓటింగ్​ ద్వారా విన్నర్‌‌‌‌ను డిసైడ్‌‌‌‌ చేస్తారు. బీబీసీలోని ఆరు లాంగ్వేజ్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ ద్వారా ఫేవరెట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌కు ఓటు వేయొచ్చు. ఈ నెల 24 వరకు ఓటింగ్‌‌‌‌ లైన్స్‌‌‌‌ అందుబాటులో ఉంటాయి. మార్చి 8న (ఇంటర్నేషనల్‌‌‌‌ వుమెన్స్‌‌‌‌ డే) విన్నర్‌‌‌‌ను ప్రకటిస్తారు. ఈసారి కొత్తగా ‘ఎమర్జింగ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌’ అవార్డును బీబీసీ ప్రవేశపెట్టింది. అయితే వరుసగా రెండో ఏడాది కూడా అవార్డుల రేస్‌‌‌‌లో మహిళా క్రికెటర్‌‌‌‌ లేకపోవడం గమనార్హం.