కౌశిక్రెడ్డి ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు: హరీష్ రావు

కౌశిక్రెడ్డి ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు: హరీష్ రావు

మంత్రి పొంగులేటి పై చర్యలు తీసుకోకుండా డైవర్షన్​ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీష్​ రావు.  మంత్రి కంపెనీ అవినీతికి పాల్పడ్డారని డిఫెన్స్​ చేసుకుంటున్నారని బీఆర్​ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే అధికార పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారని, అందుకే అసెంబ్లీలో ఆయనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో వేటు వేయాల్సి వస్తే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్​ ఎస్​  సభ్యులకు మైక్​  ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. 

ఎస్సీ, ఎస్టీలపై సీఎం రేవంత్ రెడ్డికి  ప్రేమలేదన్నారు హరీష్ రావు. దళితులపై ప్రేమ ఉంది బీఆర్​ ఎస్​ కు మాత్రమే..అందుకే దళిత బంధు ఇచ్చామన్నారు. దళితులకోసం కాంగ్రెస్​ ఏం ఇచ్చిందో చెప్పాలన్నారు. దళితబంధుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు హరీష్​ రావు.  ఎస్సీ డిక్లరేషన్​ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. 

►ALSO READ | కమిషన్లకోసమే కాళేశ్వరం కట్టారు.. పదేండ్లు ప్రజాధనం వృధా చేశారు: ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి