కమీషన్లకోసమే కాళేశ్వరం కట్టారని మునుగోడు ఎమ్మెల్యేరాజ్ గోపాల్ రెడ్డి గత బీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరంతో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. లక్ష ల కోట్లు ఖర్చు చేస్తే మనకు చుక్క నీరు రాలేదన్నారు. పదేండ్లు ప్రజాధనం వృధా చేశారన్నారు. కేసీఆర్ ఓ నియంతలా పాలించాడు.. నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ పేరుతో వివక్ష చూపారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి అన్నారు.
రిజర్వాయర్లకోసం ఎంతో మంది రైతులు భూములిచ్చారు. రిజర్వాయర్లు కడితే సరిపోదు.. కాల్వలు తవ్వించాలి.. మంత్రులు, సీఎం నియోజకవర్గాల్లోనే పనులు జరిగాయన్నారు. కొడంగల్ గెలిపించింది .. కొడంగల్ అభివృద్ది అని సీఎం అంటున్నారు. మమ్మల్ని కూడా మునుగోడు ప్రజలు గెలిపించారు. వారికి ఏమిచ్చారని ప్రశ్నించారు.
►ALSO READ | తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు చరిత్రాత్మకం: ఎమ్మెల్యే కూనంనేని
మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి న్యాయం జరగనప్పుడు పదవిలోఉండి కూడా వేస్ట్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదు..ఏ ప్రాజెక్టు వచ్చినా ఖమ్మం జిల్లాకే వెళుతున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు..మంత్రులు, సీఎం నియోజకవర్గాల్లోనే పనులు జరుగుతున్నాయి..ఎమ్మెల్యేలు లేనిది ఈ ప్రభుత్వం ఏర్పడిందా..ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోకూడా పనులు జరగాలని రాజ్ గోపాల్ రెడ్డి కోరారు.
