తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు చరిత్రాత్మకం: ఎమ్మెల్యే కూనంనేని

తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు చరిత్రాత్మకం: ఎమ్మెల్యే కూనంనేని

తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు చరిత్రాత్మకమైనదన్నారు ఎమ్మెల్యే కూనంనేని. ఆధునిక సమాజంలో నిరాదరణకు గురౌతున్న తల్లిదండ్రుల సంరక్షణకు తీసుకొచ్చిన బిల్లుపై ఆదివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. బిల్లు చిన్నదే అయినా దాని వెనక ఆత్మ.. ఆర్థ్రత చాలా గొప్పదన్నారు.  సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 

►ALSO READ | సీఎం రేవంత్‌రెడ్డితో మేనకాగాంధీ భేటీ.. జంతు సంరక్షణ చర్యలపై హర్షం

ఉద్యోగస్తుల తల్లిదండ్రుల అంశమే కాకుండా.. సమాజంలో మార్పు రావడానికి , నైతికపరమైన అంశాల్లో మార్పు వచ్చే విధంగా వ్యక్తగత జాగ్రత్తలతో పాటు , పాఠ్యాంశాల ద్వారా చైతన్యం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత సమాజంలో అమెరికన్​, యూరోపియన్​ కల్చర్​ మనపై చాలా ఉంది.. పెళ్లిళ్లు అయిన వెంటనే తల్లిదండ్రులను వదిలిపెట్టి  సంపాదన, వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టిపెడుతున్నారు. ఉమ్మడికుటుంబం భావన సమాజంలో తగ్గింది. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని  సమాజంలో మార్పుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కూనంనేని కోరారు.