అమీర్ పేట్ అగ్ని ప్రమాదంపై హర్ష మెస్ ఓనర్ రెస్పాన్స్ ఇదే..!

అమీర్ పేట్ అగ్ని ప్రమాదంపై హర్ష మెస్ ఓనర్ రెస్పాన్స్ ఇదే..!

హైదరాబాద్: అమీర్ పేట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై హర్ష మెస్ పార్ట్నర్ విజయ్ కుమార్ స్పందించారు. అగ్నిప్రమాదానికి హర్ష మెస్ కారణం అని కొందరు ఆరోపిస్తున్నారని,  తమ వల్ల ఎలాంటి సమస్య రాలేదని ఆయన వివరణ ఇచ్చారు. నెల క్రితం తమ కిచెన్ చిమ్నీ నుంచి మంటలు వచ్చాయని, అప్పుడే రెక్టిఫై చేశామని తెలిపారు.

చిమ్నీ మొత్తాన్ని రిపేర్ చేయించామని, దీన్ని సాకుగా చూపించి.. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంటలన్నీ ఉదయం 11 గంటలకే పూర్తయ్యాయని.. అన్నం వండేందుకు రెండు సిలిండర్లు మాత్రమే ఆన్లో ఉన్నాయని చెప్పారు. తమ కిచెన్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఫుటేజ్ కూడా తమ దగ్గర ఉందని.. GHMC అధికారులు కూడా వచ్చి చెక్ చేశారని హర్ష మెస్ ఓనర్ వివరణ ఇచ్చారు.

అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న KSR ఫ్యాషన్స్‌లో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. హర్ష మెస్ కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగిన స్పాట్ దగ్గర్లోనే ఉంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ అగ్ని ప్రమాదం కారణంగా మైత్రీవనం, అమీర్ పేట్ మెయిన్ రోడ్ దగ్గర దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్లో మొబైల్ షాప్స్ కూడా ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం 14 షాప్లు దగ్ధమయ్యాయి.