ఇష్టమున్నట్టు కారును కడిగితే.. పాడైతదంట.. మీరూ ఇలానే కడుగుతున్నారా

ఇష్టమున్నట్టు కారును కడిగితే.. పాడైతదంట.. మీరూ ఇలానే కడుగుతున్నారా

సెలవులు వచ్చాయంటే చాలు కొంతమంది తమ కార్లను తుడవడం లేదా క్లీన్ చేసే పనిలో మునిగిపోతుంటారు. కొందరు కార్ వాష్‌తో, మరికొందరు షాంపూతో కారును కడుగుతుండడం చూస్తూనే ఉంటాం. కొంచెం డబ్బులున్న వాళ్లైతే ఖరీదైన ఉత్పత్తులతో కారును శుభ్రం చేస్తూ ఉంటారు. అయితే అలా కారును కడిగే వారిలో చాలా మంది తప్పుడు పద్ధతిలో కారును శుభ్రం చేస్తారని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కారు మెరవడం పక్కన పెడితే.. దీర్ఘకాలంలో త్వరగా పాడైపోతుందని అంటున్నారు. అంటే, మీరు కారు క్లీన్‌గా ఉండాలనే ఉద్దేశంతో కారుపై రుద్దడం వల్ల త్వరలోనే పాడైపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆన్‌లైన్ కార్ క్లీనింగ్ అనే కొత్త మార్గం గురించి నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇలా కారును కడిగితే మీ కారు పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. లీజింగ్ ఆప్షన్స్ అనే కంపెనీకి చెందిన నిపుణులు మాట్లాడుతూ, కారును శుభ్రపరిచేటప్పుడు చాలా మంది తరచూ ఇలాంటి పొరపాటు చేస్తారని, దాని కారణంగా కారు పెయింట్ పాడైపోతుందని చెప్పారు. కారును బయట క్లీన్ చేయడానికి ఎక్కువ డబ్బు తీసుకుంటారు కాబట్టి, ఈ కారణంగా ప్రజలు ఇప్పుడు ఇంట్లోనే కారును శుభ్రం చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ శుభ్రపరిచేటప్పుడు, చాలా తప్పులు చేస్తారని, దాని కారణంగా కారు దెబ్బతింటుందని చెబుతున్నారు.

ఇలా కడగడం మానుకోండి

మీరు కొన్ని పద్దతుల్లో కారును కడగడం వల్ల పెద్దగా హాని జరగదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

షేవింగ్ ఫోమ్‌తో..

కారును శుభ్రం చేయడానికి చాలా మంది షేవింగ్ ఫోమ్‌ను ఉపయోగిస్తారు . కానీ ఈ ఫోమ్‌లోఉంటే ఓ మెటీరియల్‌ వల్ల కారు రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

లిక్విడ్ వాష్‌తో..

డిష్ వాషింగ్ ఉత్పత్తులతో కారును శుభ్రం చేయకూడదు. డిష్‌వాషర్ వంటలలోని నూనెను తొలగించగలిగితే, కారులోని మురికిని ఎందుకు తొలగించకూడదు అని కొంతమంది అనుకుంటారు. కానీ దీని వాడకం వల్ల కారుపై ఉన్న మైనపు పొర తొలగిపోతుంది. ఈ మైనపు లేయర్ కారు పెయింట్‌ను రక్షిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు డిష్‌వాష్‌తో కారును శుభ్రం చేస్తే, త్వరలోనే మీ కారు పెయింట్ దెబ్బతినవచ్చు.

ఆటోమేటిక్ కార్ వాష్..

ఇలా చేయడం చాలా మందికి సరైనదిగా కనిపిస్తుంది. కానీ దీని వల్ల కారుపై గీతలు పడతాయి. అవి చాలా చిన్నవే. కానీ దీని కారణంగా మీ కారు రంగు కూడా కాలక్రమేణా మారుతుంది.

కారు గ్లాస్‌ను శుభ్రం చేయడానికి ఉపయోగించే గ్లాస్ క్లీనర్ స్ప్రేలు కూడా కారుకు హాని కలిగిస్తాయి. దీని కారణంగా కారు గ్లాస్ బలహీనంగా తయారవుతుంది. అంతే కాదు తొందరగా పగిలిపోతుంది. దాంతో పాటు కారు గ్లాస్ పసుపు రంగులోకి మారుతుంది. 

జెట్ వాష్‌తో..

చాలా మంది  పైపులో ఫ్రెషర్ తో వచ్చే నీటితో కారును శుభ్రం చేస్తారు. దీంతో కారుపై ఉన్న దుమ్ము త్వరగా తొలగిపోతుందని భావిస్తారు. కానీ ఒత్తిడి కారణంగా కారు పాడైపోతుందన్న విషయాన్ని గ్రహించండి. ఇది కారు పెయింట్‌పైనా చెడు ప్రభావాన్ని చూపుతుంది.