హైదరాబాద్, వెలుగు: హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్సీసీబీ) తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అవిన్యా ప్లాంటులో కిన్లే వాటర్ ప్రొడక్షన్ లైన్‌ను ప్రారంభించింది. రూ.రెండు వేల కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన విభాగం నిమిషానికి 1,350 సీసాల కిన్లే నీటిని ఉత్పత్తి చేయగలదు. అత్యాధునిక ఆటోమేషన్ సాంకేతికతతో పనిచేసే ఈ ప్లాంటులో 90 శాతం వరకు నీటిని రీసైక్లింగ్ చేసే సదుపాయం ఉంది. దీని ద్వారా వెయ్యి మందికి పైగా ఉపాధి లభిస్తోందని కంపెనీ తెలిపింది.

