V6 News

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంకు లాభం రూ.20వేల 350 కోట్లు... వార్షికంగా తొమ్మిది శాతం పెరుగుదల

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంకు లాభం రూ.20వేల 350 కోట్లు... వార్షికంగా తొమ్మిది శాతం పెరుగుదల
  • మొత్తం ఆదాయం రూ.46,280 కోట్లు
  • రూ.13 చొప్పున ఫైనల్​ డివిడెండ్

న్యూఢిల్లీ:  హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్​సీ బ్యాంక్ 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్​లో బ్యాంక్  నికర లాభం (స్టాండలోన్) 9 శాతం వృద్ధితో రూ.19,221 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ లాభం రూ.17,616 కోట్లు  ఉంది.  తన షేర్​హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ.13 తుది డివిడెండ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు జూన్ 19 తేదీని రికార్డు డేట్ గా నిర్ణయించింది. బ్యాంక్ నికర ఆదాయం 5 శాతం పెరిగి రూ.46,280 కోట్లకు చేరింది. 

గత ఏడాది ఇదే సమయంలో ఆదాయం రూ.44,090 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 3.2 శాతం పెరిగి రూ.33,080 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ మొత్తం ఆస్తులపై 3.38 శాతంగా, వడ్డీని ఇచ్చే ఆస్తులపై 3.53 శాతంగా ఉంది. ఈ క్వార్టర్​లో కేటాయింపులు రూ.2,610 కోట్లుగా ఉన్నాయి.  స్థూల మొండి బకాయిలు 1.15 శాతానికి తగ్గాయి. 

గత ఏడాది ఇవి 1.33 శాతంగా ఉన్నాయి. నికర మొండి బకాయిలు 0.38 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ మూలధన సమృద్ధి నిష్పత్తి 19.7 శాతానికి పెరిగింది.  డిపాజిట్లు 12.8 శాతం పెరిగి రూ.28.5 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్ల విలువ10.8 శాతం పెరిగి రూ.9.18 లక్షల కోట్ల ఎగిసింది. హెచ్​డీఎఫ్​సీకి 4,175 పట్టణాల్లో 9,689 బ్రాంచీలు, 21,172 ఏటీఎంలు ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.14,755 కోట్లు

రెండో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ నికర లాభం నాలుగో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 9 శాతం వృద్ధి చెందింది.  కిందటేడాది నాల్గో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోని రూ.13,502.22 కోట్ల నుంచి రూ.14,755 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం పెరిగి రూ.22,979 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం  రూ.79,747.77 కోట్ల నుంచి రూ.84,613.66 కోట్లకు పెరిగింది. 

నిర్వహణ లాభం రూ.21,004.88 కోట్లుగా ఉంది.  మొత్తం ఆస్తుల విలువ రూ.29.14 లక్షల కోట్లకు చేరగా, డిపాజిట్లు రూ.18.30 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.   లోన్ల విలువ రూ.16.44 లక్షల కోట్లకు పెరిగింది.  తన వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.12 డివిడెండ్ ఇవ్వనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.