Health Secret : మన శరీరంలో కాఫీ, చాక్లెట్ జీన్స్ ఉంటాయంట

Health Secret : మన శరీరంలో కాఫీ, చాక్లెట్ జీన్స్ ఉంటాయంట

బ్లాక్ కాఫీ, డార్క్ చాక్లెట్ ఇష్టమా?  అయితే.. మీ జీన్స్ లోనే కాఫీ, చాక్లెట్ లు ఉన్నట్టు లెక్క. ఈ రెండూ లైక్ చేసేవాళ్ల గురించి అమెరికాలో ఓ రీసెర్చ్ జరిగింది. మార్లిన్ కార్నెలిస్ ఫెయిన్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో అసోసియెట్ ప్రొఫెసర్.. బ్లాక్ కాఫీ, డార్క్ చాక్లెట్ ఇష్టపడే వాళ్ల జీన్స్ లోనే కాఫీ, చాక్లెట్లు ఉంటాయంటున్నారు. వీళ్లలో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువగానే ఉంటాయి అంటున్నారు. రోజుకు ఓ మూడు కప్పుల బ్లాక్ కాఫీ తాగేవాళ్లలో గుండె సమస్యలు, పార్కిన్ సన్, టైప్ టు డయాబెటిస్ వంటివి వచ్చే రిస్క్ తక్కువ. ఈ విషయాన్ని చాలా రీసెర్చ్ ప్రూవ్ చేశాయి. అయితే ఆ కాఫీలో షుగర్ ఎక్కువ ఉండకూడదు. 

పాలు, చక్కెర వేసిన కాఫీతో అంత ఉపయోగం ఉండదు. డార్క్ చాక్లెట్లను కూడా తక్కువ తింటేనే బెటర్. కార్నెలిస్ చేసిన ప్రయోగంలో కాఫీ ఎక్కువగా తాగే వారిలో ఒక జెనెటిక్ వేరియంట్ కనుగొన్నారు. వీళ్లంతా ఒక కప్పు కాఫీతో ఆగే రకం కాదు. కనీసం రోజుకు మూడు నుంచి అయిదు కప్పులు లాగించాల్సిందే. 11 ఇలాంటి వాళ్ల ఈ జీన్ వేరియెంట్ యాక్టివ్ గా కనిపించింది. వీళ్లు డార్క్ చాక్లెట్లను కూడా ఇష్టపడ్డారట. డార్క్ చాక్లెట్, బ్లాక్ కాఫీ మైండ్ చురుగ్గా పనిచేసేలా చూస్తాయి. బ్రెయిను బూస్టప్ చేస్తాయి. దీనికి కారణం వాటిల్లో ఉండే చిన్నపాటి చేదు. ఆ రుచే అడిక్షన్ కు కారణం.