V6 News

రాష్ట్రంలో రేపటి వరకు వర్షాలు : వాతావరణ శాఖ

రాష్ట్రంలో రేపటి వరకు వర్షాలు : వాతావరణ శాఖ

మాండౌస్ తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో మలక్ పేట, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట,  బేగంపేట, టోలిచౌకి, మాసబ్ ట్యాంక్, నాంపల్లి, ఆబిడ్స్, హిమాయత్ నగర్ ఏరియాల్లోనూ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. 

నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రెండు రోజులుగా విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం వరకు వర్షాలు పడతాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.