హైదరాబాద్ లో వాహనదారులకు నరకం చూపిస్తోంది ట్రాఫిక్. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లోని పలు ప్రధాన రహదారులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి నోవాటెల్ రూట్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రోడ్లపై మోకాళ్లోతు నీళ్లు నిలవడంతో... వాహనాలు అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. సాయంత్రం ఆఫీసుల నుంచి బయల్దేరిన ఐటీ ఉద్యోగులు, వాహనదారులు... రాత్రి 9 గంటలు దాటినా, ఇంకా రోడ్లపైనే నరకయాతన అనుభవిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ (GHMC) డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి నీటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. కాబట్టి, ఈ రూట్లలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఈ రూట్లలో ప్రయాణాలు పెట్టుకోవద్దు.
