వర్షాల బాధితులను ఆదుకోండి: రేవంత్రెడ్డి పిలుపు

వర్షాల బాధితులను ఆదుకోండి: రేవంత్రెడ్డి పిలుపు

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ టైంలో పార్టీ కార్యకర్తలు, లీడర్లు సహాయక చర్యల్లో పాల్గొని పీసీసీ చీఫ్​  రేవంత్​ రెడ్డి పిలుపునిచ్చారు. వాన లతో వాగులు పొంగి పొర్లు తున్నాయని, హైదరాబాద్ లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయని శుక్రవారం ఓ ప్రకట నలో పేర్కొన్నారు. లోతట్టు ప్రాం తాల్లో ఇండ్లలోకి నీళ్లు చేరి స్థాని కులు తీవ్రంగా ఇబ్బందులు పడు తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు పాలు, ఆహారం ఇవ్వలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు.