దేశానికి అన్నంపెట్టే మామ.. దేశాన్ని కాపాడే అల్లుడు

దేశానికి అన్నంపెట్టే మామ.. దేశాన్ని కాపాడే అల్లుడు

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా వెంకీమామ. దీపావళి కానుకగా ఈ మూవీలోని ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది యూనిట్. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకుంటుండగా..ఇవాళ వచ్చిన పోస్టర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. చైతూ ఆర్మీ డ్రెస్ లో అదరగొట్టగా..వెంకీ దేశానికి అన్నంపెట్టే రైతులా కనిపించాడు. అంటే జై జవాన్ జై కిసాన్ స్లోగన్ థీమ్ తోనే స్టోరీ నడవనున్నట్లు పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది.

కె.ఎస్.రవీంద్ర తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తోలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ లో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది. ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన వెంకీ  F2 సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.