కరోనా కాలంలో పార్లే–జీ బిస్కెట్లను ఎక్కువగా కొన్నరు

కరోనా కాలంలో పార్లే–జీ బిస్కెట్లను ఎక్కువగా కొన్నరు
  • 40 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో అమ్మకాలు
  • 5శాతం మార్కెట్‌ వాటను పొందిన సంస్థ

న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో జనం పార్లే – జీ బిస్కెట్లను ఎగబడికొన్నరంట. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా చాలా వ్యాపారాలు దెబ్బతింటే.. నిత్యావసర సరుకులకు మాత్రం బాగా గిరాకీ పెరిగింది. దీంతో తినుబండారాల తయారీ కంపెనీలకు లాభాలు ఎక్కువగా వచ్చాయి. అయితే లాక్‌డౌన్‌ ముందు వరకు కష్టాల్లో ఉన్న పార్లే – జీ బిస్కెట్ల తయారీ కంపెనీ ఇప్పుడు అమ్మకాల్లో దూసుకుపోతుంది. ఈ కరోనా కష్టకాలంలో ఎక్కువ మంది పార్లే – జీ బిస్కెట్లనే కొన్నారు. దీంతో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత విధంగా అమ్మకాలు జరిగాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో దాదాపు మార్కెట్‌ షేర్‌‌ 5 శాతానికి విసర్తించినట్లు చెప్పాయి. ప్రభుత్వ, స్వచ్చంధ సంస్థలు బిస్కెట్లు పంచడం లాంటి సేవా కార్యక్రమాలు పెరగడంతో బిస్కెట్ ప్యాకెట్ల అమ్మకాలు పెరిగాయని అన్నారు. రూ.2 కే శక్తినిచ్చే గ్లూకోజ్‌ బిస్కెట్లు వస్తున్నందున పార్లే –జీ బిస్కెట్లకే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇచ్చారని పార్లే ప్రాడెక్ట్స్‌ సీనియర్‌‌ కేటగిరి హెడ్‌ మయాంక్‌ షా చెప్పారు. అంతే కాకుండా నిల్వ చేసుకునేందుకు వీలు ఉండటం వల్ల కూడా ఎక్కువ మంది కొనుకుంటున్నారని అన్నారు. ఇండియాలో ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రజలు పార్లే – జీని సౌకర్యవంతమైన ఫుడ్‌గా అనుకుంటారని ఆయన అన్నారు. గతంలో సునామీ, భూకంపాలు వచ్చిన సమయంలో కూడా విక్రయాలు పెరడగమే దీనికి నిదర్శనం అని చెప్పారు. ప్రజలు తమ బ్రాండ్‌పైన పెట్టుకున్న నమ్మకం అలాంటిదని షా అన్నారు.