సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ఆర్ధరాత్రి 2 గంటల సమయంలో బ్రీథింగ్  ప్రాబ్లం రావడంతో కుటుంబ సభ్యలు ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు.   కృష్ణకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 

ఇవాళ సాయంత్రంగానీ లేక రేపు ఉదయం గానీ ఆయనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇటీవలే కృష్ణ  సతీమణి ఇందిరాదేవి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.   

‘‘కృష్ణ ఆరోగ్యం బాగానే ఉంది. శ్వాస సంబంధిత సమస్యతో ఆదివారం ఆస్పత్రిలో చేర్చాం. 24గంటల తర్వాత ఆస్పత్రి నుంచి కృష్ణను డిశ్చార్జ్ చేస్తారు’’ అని నరేశ్‌ తెలిపారు.