యూత్‌‌ కోసం హే చికీతా మూవీ..

యూత్‌‌ కోసం హే చికీతా మూవీ..

అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘హే చికీతా’. ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో  ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించారు.  జులై 24న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు,  తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రసన్న కుమార్,  రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అలీ, వీఎన్ ఆదిత్య  అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌‌కు బెస్ట్ విషెస్ అందించారు. 

కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రంలో గొప్ప సందేశం ఉందని అన్నారు.  ఈ సందర్భంగా దర్శకుడు ధనరాజ్ లెక్కల మాట్లాడుతూ ‘ఇది నా తొలి చిత్రం.   రైతులు, యూత్ కోసం ఈ మూవీని తీశా.  నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’ అని చెప్పాడు. 

ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందని, ఇందులో నటించడం చాలా సంతోషంగా ఉందని నటీనటులు  అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి అన్నారు. ఈ కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని నిర్మాతలు ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి అన్నారు. నటులు దేవి ప్రసాద్, యోధ, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ పాల్గొన్నారు.