ఆలిండియా కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిర్ణయం కేంద్రానిదే

ఆలిండియా కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల  డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిర్ణయం కేంద్రానిదే

హైదరాబాద్, వెలుగు: ఆలిండియా సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. డిప్యూటేషన్ గడువు తీరిన తర్వాత కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఆలిండియా కేడర్ ఆఫీసర్లు పని చేయాల్సిందేనని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో కొనసాగడానికి వీల్లేదని చెప్పింది. 

కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగినట్టుగానే ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుందని పేర్కొంది. డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎక్కువ కాలం పనిచేసిన తమిళనాడు కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన డి. కల్పనానాయక్, మహేంద్రకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఇటీవల క్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏకే సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీఎం మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లతో కూడిన బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంగళవారం తీర్పు వెలువరించింది.