డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు : హైకోర్ట్

డిగ్రీ, పీజీ  పరీక్షల నిర్వహణపై  ప్రభుత్వానికి క్లారిటీ లేదు : హైకోర్ట్

డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జ‌రిగింది. విచార‌ణ సంద‌ర్భంగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై తెలంగాణ ప్ర‌భుత్వానికి క్లారిటీ లేద‌ని హైకోర్ట్ అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

సెమిస్టర్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించాలని ఎన్ఎస్ యూఐ ,ఇతర పిటిషనర్లు కోర్ట్ ను కోరారు. అందుకు ప్ర‌తిస్పంద‌న‌గా ఆన్ లైన్ లో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలు కాద‌ని, గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు ,ఇంటర్నెట్ సమస్య తలెత్తుతున్న‌ట్లు ప్రభుత్వం తెలిపింది.

అయితే పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చని, సప్లిమెంటరీ లో ఉత్తీర్ణులైనప్పటికీ రెగ్యులర్ గా పరిగణిస్తామ‌ని సూచించింది. అటానమస్ కాలేజీలకు మాత్రం ఆన్ లైన్ లో నిర్వహించేందుకు స్వేచ్ఛ ఇచ్చామని ప్ర‌భుత్వం చెప్ప‌గా..క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తామ‌ని ఓయూ అధికారులు, మిడ్ టర్మ్ పరీక్షలు ఆన్ లైన్ లో.. సెమిస్టర్ ఆఫ్ లైన్ లో నిర్వహిస్తామ‌ని జే ఎన్ టీయూహెచ్ కోర్ట్ కు విన్న‌వించుకున్నాయి.

ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ప్రభుత్వ విధానం గందరగోళంగా కనిపిస్తోంద‌ని, ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ఎదో ఒకే విధానం ఉండేలా స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పించ్చింది.