KKR vs PBKS: రూ. 25 కోట్ల ఆటగాడిపై వేటు.. స్టార్క్ స్థానంలో లంక ఫాస్ట్ బౌలర్

KKR vs PBKS: రూ. 25 కోట్ల ఆటగాడిపై వేటు.. స్టార్క్ స్థానంలో లంక ఫాస్ట్ బౌలర్

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్. అతనిపై ఎన్నో ఆశలతో కోల్‌కతా నైట్ రైడర్స్ గత వేలంలో ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఆ టీమ్ ఆడిన 7 మ్యాచ్ లలో స్టార్క్ కేవలం 6 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అంతేకాదు భారీగా పరుగులు ఇస్తూ ఏకంగా 11కు పైగా ఎకానమీ రేటు నమోదు చేస్తున్నాడు. కేకేఆర్ టీం వరుస విజయాలతో దూసుకెళ్తున్న స్టార్క్ మాత్రం ప్రతి మ్యాచ్ లో విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. దీంతో ఈ ఆసీస్ బౌలర్ పై నేడు వేటు పడడం ఖాయంగా కనిపిస్తుంది. 

ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 26) కోల్‌కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమే. దీంతో ఈ మ్యాచ్ లో కేకేఆర్ వరుసగా విఫలమవుతున్న మిచెల్ స్టార్క్ ను పక్కన పెట్టె అవకాశం ఉంది. ఈ ఆసీస్ బౌలర్ స్థానంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ చమీరాకు అవకాశం దక్కొచ్చు. చమీర గతంలో లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడాడు. కొత్త బంతితో స్వింగ్ వేయడంలో చమీర సిద్ధహస్తుడు. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే కేకేఆర్ జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

Also Read: నేడు కోల్కతాతో పంజాబ్ మ్యాచ్.. ధావన్ దూరం! 

ఇప్పటివరకు టోర్నీలో 7 మ్యాచ్ లు ఆడిన కేకేఆర్ 5 మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరో వైపు పంజాబ్ పేలవ ఆట తీరును ప్రదర్శిస్తుంది. ఆడిన 8 మ్యాచ్ ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో 9 స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ ఓడిపోతే పంజాబ్ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. ఓ వైపు  కేకేఆర్ గెలిచి ప్లే ఆఫ్ కు దగ్గరవ్వాలని చూస్తుంటే.. మరోవైపు పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలని భావిస్తుంది.