Salaar Part2: ఖాన్సార్లో అడుగుపెట్టనున్న బాలీవుడ్ బ్యూటీ.. మరి శృతి హాసన్ సంగతేంటి?

Salaar Part2: ఖాన్సార్లో అడుగుపెట్టనున్న బాలీవుడ్ బ్యూటీ.. మరి శృతి హాసన్ సంగతేంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన సలార్(Salaar) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని  సాధించింది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఫీలింగ్ ని ఇచ్చింది. కొంత కాలంగా సరైన హిట్టు లేక బాధపడుతున్న ప్రభాస్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది సలార్.

ఈ సినిమాకు సీక్వల్ గా సలార్ పార్ట్ 2(శౌర్యంగపర్వం) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో పార్ట్ 2పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా అలాంటి న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పార్ట్ 2 కోసం మరో స్టార్ బ్యూటీని తీసుకోవాలని ప్లాన్  చేస్తున్నాడట. ఆ బ్యూటీ మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ. అవును సలార్ పార్ట్ 2లో కీ రోల్ కోసం కియారాను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.  

ఇక సలార్ పార్ట్ 2 షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.   త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాను 2025 ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.