హైదరాబాద్, వెలుగు: నిర్మల్ జిల్లా ధర్మసాగర్ చెరువులో ఆక్రమణలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. ధర్మాసాగర్‌లో ఎఫ్‌టీఎల్ ప్రాంతంలోని నిర్మాణాలపై ప్రజావాణిలో ఇచ్చిన వినతి పత్రాలపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ నిర్మల్‌కు చెందిన ఎన్. శ్రావణ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు బుధవారం విచారించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ధర్మసాగర్ ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో ప్రైవేటు నిర్మాణాలు వెలిశాయని, వాటిపై అధికారులకు పలు దరఖాస్తులను సమర్పించినా చర్యలు తీసుకోవడంలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ఆక్రమణల తొలగింపుపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది.
