మార్చి 14న వ్యక్తిగతంగా హాజరుకండి

మార్చి 14న వ్యక్తిగతంగా హాజరుకండి

హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో మార్చి 14న వ్యక్తిగతంగా హాజరుకావాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జైళ్ల శాఖ డీజీ, ఐజీ, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను హైకోర్టు ఆదేశించింది. జైళ్ల శాఖలో పనిచేస్తున్న మహిళా సూపరింటెండెంట్లకు పదోన్నతులు కల్పించాలన్న ఆదేశాలు ధిక్కరించినందుకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రమోషన్లలో 13శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ చంచల్ గూడ జైలు మహిళా సూపరింటెండెంట్ వెంకటలక్ష్మీ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం రెండు నెలల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. అయితే గడువు ముగిసినా కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఇవాళ దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మార్చి 14న వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తెలంగాణ సీఎస్, జైళ్ల శాఖ డీజీ,ఐజీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణపై కేంద్రం వివక్ష

రొమేనియాలో భారత విద్యార్థులతో మాట్లాడిన కేంద్ర మంత్రి