ఇరాన్ 3 ఎయిర్ పోర్టులపై ఇజ్రాయెల్ దాడి.. భారీగా విమానాలు, హెలికాప్టర్లు, మిలిటరీ సామాగ్రి డ్యామేజ్

ఇరాన్ 3 ఎయిర్ పోర్టులపై ఇజ్రాయెల్ దాడి.. భారీగా  విమానాలు, హెలికాప్టర్లు, మిలిటరీ సామాగ్రి డ్యామేజ్

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం పీక్స్ కు చేరుకుంది. సీజ్ ఫైర్ ప్రతిపాదనలతో యుద్ధం ఆగుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో.. అంతకు మించిన తీవ్రతతో దాడులు చేసుకుంటున్నాయి. సోమవారం (2026 ఏప్రిల్ 06) ఇరాన్ పై భీకర దాడులకు దిగింది ఇజ్రాయెల్. ఇరాన్ మూడు కీలక ఎయిర్ బేసులపై దాడి చేసినట్లు IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) ప్రకటించింది. ఈ దాడిలో యుద్ధ విమానాలు, హెలీకాప్టర్లు, మిలిటరీ యుద్ధ సామాగ్రి ధ్వంసమైటన్లు పేర్కొంది. 

ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్, క్వాడ్ ఫోర్స్ యూనిట్ చీఫ్ (Quds Force unit chief) ను అంతం చేసినట్లు అంతకు ముందే IDF ప్రకటించింది. IRGC ఇంటెలిజెన్స్ మేజర్ జనరల్ మాజిద్ ఖాదెమీని మట్టుబెట్టినట్లు తెలిపింది. వీరితో పాటు క్వాడ్ ఫోర్స్ 840 యూనిట్ కు చెందిన సీనియర్ ను కూడా చంపేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని చూసే వారెవైరా మా చేతుల్లో చావాల్సిందేనని ఈ ఘటన తర్వాత ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. గల్ఫ్ లో ముప్పును తొలగించే వరకు అన్ని వైపుల నుంచి దాడులు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. 

  • అప్పటి వరకు యుద్ధం ఆగదు: ఇరాన్

మరోవైపు యుద్ధం అవసరమని ఇరాన్ నాయకత్వం భావించినన్ని నాళ్లు యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. యుద్ధం తర్వాత తమ శత్రువులు పశ్చతాపం చెందాల్సి వస్తుందని ఆర్మీ స్పోక్స్ పర్సన్ మొహమ్మద్ అక్రమినియా చెప్పారు. 

అంతకు ముందు ఇరాన్ లోని సౌత్ పార్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్-అమెరికా జరిపిన దాడిలో భారీ నష్టం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడిలో 25 మంది చనిపోగా.. సౌత్ పార్ సహజవాయు క్షేత్రం డ్యామేజ్ అయ్యింది. దీనికి ప్రతికారంగా ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ లోని అమెరికా మిత్ర దేశాలపై మిసైల్స్ తో దాడికి దిగింది ఇరాన్. 

ఇక ఇరాన్-అమెరికా 45 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకోవాలని ప్రతిపాదనలు నడుస్తున్నాయి.  ఈ చర్చల్లో ఈజిప్టు, పాకిస్తాన్, తుర్కిష్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపేసి హర్మూజ్ జలసంధిని తెరవాల్సిందిగా ట్రంప్ కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఇరాన్ తమ డిమాండ్స్ నెరవేరేదాకా ఒప్పుకునేది లేదని అంటోంది. ఒకవేళ సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నా.. జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.