మన దేశంలో ప్రస్తుతం చాలామంది కిచెన్లో ఎక్కువగా నాన్ స్టిక్ పాత్రలే వాడుతున్నారు. ఇవి వాడటం వల్ల బౌల్స్ క్లీన్ చేయడం ఈజీ, ఆయిల్ కూడా ఆదా అవుతుందని భావిస్తుంటారు. కానీ.. వీటి వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉందని చాలా మందికి తెలియదు. ఈ నాన్ స్టిక్ ప్యాన్ మీద పడే చిన్న గీత కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుందని ఎంత మందికి తెలుసు. అవును.. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో ఈ నాన్ స్టిక్ ప్యాన్ గురించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
A single scratch on your nonstick pan releases millions of toxic chemicals into your dinner.
— Smart Science (@SmartScience) April 5, 2026
Researchers in Australia have uncovered a startling health hazard hiding in plain sight in kitchens across the globe.
Using advanced imaging technology, scientists found that even a… pic.twitter.com/OIlRpi2Oxc
గిన్నెలు రుద్దే సమయంలో, వంట చేసే సమయంలో ఈ నాన్ స్టిక్ ప్యాన్ మీద పడే ఒక సింగిల్ స్క్రాచ్ (చిన్న గీత) 9 వేల టాక్సిక్ మైక్రో ప్లాస్టిక్ అవశేషాలను విడుదల చేస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. అప్పటికే వాడీవాడీ ఉన్న నాన్ స్టిక్ ప్యాన్పై ఉన్న స్క్రాచ్లు దాదాపు 2 మిలియన్ల మైక్రో ప్లాస్టిక్ అవశేషాలను విడుదల చేస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. అంటే.. ఈ నాన్ స్టిక్ ప్యాన్లపై ఉండే స్క్రాచ్లు ఎంత డేంజర్ అనేది ఈపాటికే అర్థమై ఉంటుంది. మనం మన కుటుంబ సభ్యులకు తెలిసి తెలిసి ప్లాస్టిక్ను వడ్డించం.
కానీ.. ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ లపై వండే వంటకాల వల్ల మనకు తెలియకుండానే మన శరీరంలోకి లక్షల మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు వెళుతున్నాయి. ఈ మైక్రో ప్లాస్టిక్ శరీరంలో విచ్ఛిన్నం కావు. ఈ కారణంగా.. క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి ప్రమాదకర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ఇప్పటికే మనలో చాలా మంది ఈ మైక్రో ప్లాస్టిక్ బాధితులే.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఒక్కరి రక్తంలో ఈ రసాయనాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో భయపడటం కాకుండా అవగాహన పెంచుకోవడం అవసరం. ఎందుకంటే.. ఆరోగ్యం మనం రోజూ తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఆ ఆహారం వంట గదిలో ఏ పాత్రల్లో వండుతున్నామనేది కూడా చాలా ముఖ్యం.
