IPL 2026: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కేకేఆర్.. 

IPL 2026: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కేకేఆర్.. 

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో, ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ నమోదు చేయాలని కేకేఆర్ భావిస్తోంది. దీంతో పంజాబ్ జట్టు తొలుత ఫీల్డింగ్ చేసిన KKRని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తుంది. 

కోల్‌కతా నైట్ రైడర్స్ అజింక్యా రహానే మాట్లాడుతూ.. మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాం.. ఈ పిచ్ మంచి స్థితిలో కనిపిస్తుంది. కొంచెం పొడిగా ఉంది, అలాగే గడ్డి కవరింగ్ కూడా తక్కువగా ఉంది.. ఇది మంచి వికెట్.. మ్యాచ్ గెలిచేందుకు నమ్మకం, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం.. చిన్న చిన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుని గెలుస్తామన్నామని రహానే  తెలిపారు. ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. 

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. నిజానికి నేను కూడా బౌలింగ్ చేయాల్సి ఉండేది.. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉన్నాను.. మా హెడ్ కోచ్ రికీ పాంటింగ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.. మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది.. అతను యువ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు, పాంటింగ్ స్వయంగా ఒక ప్రేరణ.. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవని చెప్పాడు. 

పంజాబ్ కింగ్స్: 
ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కనోలీ, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయకుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కతా నైట్ రైడర్స్: 
ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశి (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రామండీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి.