ట్రాలీ ఆటో పైకి దూసుకెళ్లిన కారు

ట్రాలీ ఆటో పైకి దూసుకెళ్లిన కారు

శంషాబాద్, బెంగుళూరు జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ప్రమాదం జరిగింది. సిద్దాంతి బస్తీకి చెందిన వికాస్ కారును వేగంగా నడిపి బీభత్సం సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. ట్రాలీ, ఆటోలను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. 

ప్రమాదంలో ఆటో డ్రైవర్ లింగంకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో ఆటో, కారు ధ్వంసం అయ్యాయి. దీంతో రోడ్డుపై రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిన్ ను క్లియర్ చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.