V6 News

హిమదాస్‌కు 4 వ గోల్డ్‌

హిమదాస్‌కు 4 వ గోల్డ్‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌  స్ప్రింటర్‌‌ హిమదాస్‌‌ 15 రోజుల వ్యవధిలో నాలుగో స్వర్ణంతో సత్తా చాటింది. చెక్‌‌ రిపబ్లిక్‌‌లో జరుగుతున్న టబొర్‌‌ అథ్లెటిక్‌‌ మీట్‌‌లో బుధవారం జరిగిన 200 మీటర్ల రేసును హిమ 23.25 సెకన్లలో ముగించి స్వర్ణం గెలిచింది. వీకే విస్మయ 23.43 సెకన్ల టైమింగ్‌‌తో రజతం గెలుచుకుంది. మెన్స్‌‌ 400 మీటర్ల రేస్‌‌ను 45.40 సెకన్లలో పూర్తిచేసిన ఇండియా స్ప్రింటర్‌‌ మహ్మద్‌‌ అనాస్‌‌  గోల్డ్‌‌ మెడల్‌‌ గెలవగా, సహచర స్ప్రింటర్లు టామ్‌‌ నోహ్‌‌ నిర్మల్‌‌(46.59 సెకన్లు), కేఎస్‌‌ జీవన్‌‌(46.60 సెకన్లు), ఎంపీ జబిర్‌‌(47.16 సెకన్లు) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. జులై 2న జరిగిన పొజన్‌‌ అథ్లెటిక్‌‌ గ్రాండ్‌‌ప్రీలో 200 మీటర్ల రేస్‌‌ను 23.65 సెకన్లతో పూర్తి చేసి గోల్డ్‌‌ గెలిచిన హిమ, 7వ తేదీన కుంటో అథ్లెటిక్‌‌ మీట్‌‌లో 23.97 సెకన్ల టైమింగ్‌‌తో రెండో గోల్డ్‌‌ను సాధించింది. 13వ తేదీన క్లాడ్నో అథ్లెటిక్‌‌ మీట్‌‌లో 23.43 సెకన్లలో రేస్‌‌ పూర్తి చేసి మూడో గోల్డ్‌‌ ఒడిసిపట్టుకుంది.