మహారాష్ట్రలో రాజాసింగ్ క్రేజ్

మహారాష్ట్రలో రాజాసింగ్ క్రేజ్

లవ్ జిహాద్, మత మార్పిడులు, గో హత్యల నివారణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ర్యాలీ సందర్భంగా ముంబైలోని శివాజీ పార్క్ ప్రాంతం హిందూ మద్దతుదారులతో కిక్కిరిసిపోయింది. ర్యాలీలో భాగంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఇచ్చిన స్పీచ్ కు విశేష స్పందన వచ్చింది. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేకు మహారాష్ట్రలో ఇంత క్రేజ్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో పుణెలో నిర్వహించిన ర్యాలీలోనూ రాజసింగ్ కు అక్కడి ప్రజలు ఎంతగానో ఆదరించారు. తామహారాష్ట్రలో రాజసింగ్ క్రేజ్ పై ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.