బంజారాహిల్స్ లో HMDA భూముల వేలం..ఎకరానికి 99కోట్లతో అమ్మకానికి నోటిఫికేషన్

బంజారాహిల్స్ లో HMDA భూముల వేలం..ఎకరానికి 99కోట్లతో అమ్మకానికి నోటిఫికేషన్

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ప్రభుత్వ భూమి  వేలానికి  HMDA నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్యే కాలనీని ఆనుకొని ఉన్న  8ఎకరాల 24 గుంటల  ప్రభుత్వ భూమిని ఎకరాకు 99 కోట్ల రూపాయల ప్రారంభ ధరగా నిర్ణయించింది. ఈ వేలంలో పాల్గొనేవారు ముందస్తుగా ఎకరానికి 5కోట్ల రూపాయలు ధరావత్తు(ఈ ఎండీ) చెల్లించాలని కోరింది.  జూన్ 19న  ప్రీ బిడ్ మీటింగ్, జూలై 2న ఈ వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి గల పెట్టుబడి దారులు, ప్రతినిధులు వేలం పాల్గొనవచ్చని తెలిపింది. 

►ALSO READ | మగపిల్లల మోజు ఇంకా వీడలేదు.. మారని సమాజ మనస్తత్వంపై సుప్రీంకోర్టు ఆందోళన