ఆధార్చూపిస్తే ఇంటికి ఐదు మొక్కలు..వనహోత్సవంలో భాగంగా హెచ్ఎండీఏ నిర్ణయం

ఆధార్చూపిస్తే ఇంటికి ఐదు మొక్కలు..వనహోత్సవంలో భాగంగా హెచ్ఎండీఏ నిర్ణయం

హైదరాబాద్​సిటీ, వెలుగు : వన మహోత్సవంలో భాగంగా ఆధార్​కార్డు చూపిస్తే ఇంటికి ఐదు మొక్కలు పంపిణీ చేస్తామని హెచ్ఎండీఏ అర్బన్​ఫారెస్ట్రీ అధికారులు తెలిపారు. సిటీలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 44 నర్సరీల నుంచి ఎవరైనా ఆధార్​కార్డు చూపించి ఉచితంగా మొక్కలను పొందవచ్చన్నారు. ఈ ఏడాది లక్ష కుటుంబాలకు ఐదు చొప్పున మొక్కలు ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

ఐదు మొక్కల్లో మూడు పండ్ల మొక్కలు, రెండు ఔషధ మొక్కలు లేదా అలంకరణ మొక్కలు తీసుకోవచ్చన్నారు. ఇందులో మామిడి, జామ, సపోటా, రేగు, సీతాఫలాలు, బొప్పాయి, కరివేపాకు, అరటి, వేప, చింత ఉన్నాయన్నారు. వివరాలకు హార్టీకల్చర్​డైరెక్టర్​చక్రపాణి 8374449345, ఫారెస్ట్​ మేనేజర్లు వంశీ కృష్ణ 9849052634, ప్రణీత్​ కౌర్​9618501983, దీపిక 9441366136, సత్యానారాయణమ్మ 6309029925, నిఖిల్​9985157768ను సంప్రదించవచ్చన్నారు.