గ్రేటర్ మాదిరిగానే HMDA అభివృద్ధి .. కాంప్రహెన్సివ్ రోడ్ డెవలప్ మెంట్ పై కసరత్తు

గ్రేటర్ మాదిరిగానే HMDA అభివృద్ధి .. కాంప్రహెన్సివ్  రోడ్  డెవలప్ మెంట్ పై  కసరత్తు
  • జంక్షన్ల అభివృద్ధికి సైతం ప్లాన్
  • అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించుకోవాలని అధికారుల నిర్ణయం
  • నిధుల సమీకరణ ఎలా చేయాలన్న దానిపై త్వరలో వెల్లడి

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో డెవలప్​మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో భారీ అభివృద్ధి పనులకు అధికారులు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంప్రహెన్సివ్​ రోడ్​డెవలప్​మెంట్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో హెచ్ఎండీఏ పరిధి 7,253 చ. కి.మీ. విస్తీర్ణం వరకు ఉండగా, ప్రస్తుతం11,257 చ. కి. మీ. వరకు పెరిగింది. అంటే మొత్తం 11 జిల్లాలను కలిపి ఏర్పాటు చేసిన హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్​మాదిరిగానే అభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. రాబోయే రోజుల్లో ఫ్యూచర్​సిటీ కూడా భారీ ఎత్తున రూపుదిద్దుకోబోతున్న దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిపుల్​ఆర్​వరకూ హెచ్ఎండీఏను అభివృద్ధి చేయాలంటే పటిష్టమైన రోడ్​ప్లాన్​అవసరం అవుతుందని అధికారులు తెలిపారు.

 ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్​రద్దీ నియంత్రణపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. పాదచారుల కోసం ప్రత్యేకంగా పెడస్ట్రియన్ జోన్​, వెహికులర్​సేఫ్టీ ఉండాల్సిందేనని అంటున్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్త జంక్షన్లను ఏర్పాటు చేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న వాటిని కూడా అభివృద్ధి చేసేందుకు జంక్షన్​ఇంప్రూవ్​మెంట్​ ప్లాన్​ను అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీటన్నింటిని ఇంటర్​నేషనల్​స్టాండర్స్​తో తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తున్నది. 

అంతర్జాతీయ స్థాయి  కన్సల్టెన్సీ కోసం

భారీ ఎత్తున చేపట్టనున్న రహదారుల అభివృద్ధి, జంక్షన్​ఇంప్రూవ్​మెంట్​కోసం అంతర్జాతీయ స్థాయి  కన్సల్టెన్సీని నియమించాలని హెచ్ఎండీఏ అధికారులు ఆలోచిస్తున్నారు.  కన్సల్టెన్సీ సంస్థ ద్వారానే ఆయా పనులకు సంబంధించి డిటైల్డ్​ప్రాజెక్ట్​రిపోర్ట్​(డీపీఆర్​)ను తయారు చేయించనున్నారు. ఇందులో డిటైల్డ్​టోపోగ్రఫీ సర్వే చేయించనున్నారు. అంతర్జాతీయంగా సర్వేలు చేయడంలో ఎక్స్​పర్ట్ అయిన​సంస్థలను ఈ మేరకు నియమించుకోనున్నారు. ఇందులో భాగంగానే డిటైల్డ్​ట్రాఫిక్​సర్వే, ట్రాన్స్​పోర్ట్​ సర్వే నిర్వహించనున్నారు.

 ఆయా ప్రాంతాల బేస్​మ్యాప్​ల ఆధారంగా వీటిని రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు. కన్సల్టెంట్​గా నియమించే సంస్థకు కనీసం సర్వే చేయడంలో ఏడేండ్ల అనుభవం ఉండాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా రోడ్​ ఇన్ఫ్రాస్ట్రక్చర్​ ప్లానింగ్, డెవలప్​మెంట్​వంటిలో అనుభవం ఉన్న వారిని కన్సల్టెంట్ గా నియమించాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుందన్న విషయాన్ని కూడా డీపీఆర్​లో వెల్లడించనున్నారు. 

అలాగే ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల సమీకరణ ఎలా ఉండాలన్న విషయాన్ని కూడా హెచ్​ఎండీఏ అధికారులు ఆలోచిస్తున్నారు. నేరుగా ప్రభుత్వ నిధులతో వీటిని రూపొందించాలా? ప్రైవేట్​ భాగస్వామ్యాన్ని తీసుకోవాలా? అన్నది త్వరలో నిర్ణయిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.