బైక్ ప్రియులకు శుభవార్త: మార్కెట్ లోకి హోండా 1000 సీసీ

బైక్ ప్రియులకు శుభవార్త: మార్కెట్ లోకి హోండా 1000 సీసీ

హోండా కంపెనీ సీబీ-1000 సీసీ బైక్ ను మర్కెట్లో రిలీజ్ చేస్తుంది. రైడ్ బై వైర్ టెక్నాలజీతో బైక్ ను తయారు చేసినట్టు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ బండికి ఆరు గేర్లు ఉంటాయి. దీనిపై కేవలం ఒకరు మాత్రమే కూర్చునేలా డిజైన్ చేశారు. ఈ బండి ధర భారత్ లో 14.46 లక్షలు ఉండనున్నట్లు తెలిపారు. కేవలం 350 యునిట్ల బైక్ లను మాత్రమే తయారు చేయనున్నట్లు చెప్పారు.

వైట్, రెడ్, బ్లూ రంగులలో సీబీ1000 బైక్ అందుబాటులోకి వస్తున్నట్లు హొండా కంపెనీ తెలిపింది. ఈ బైక్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.

998 సీసీ 4సిలిండర్ ఇంజన్
నాలుగు రైడింగ్ మోడ్స్
ఎస్‌సీ ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ ఎక్స్‌హాస్ట్
ఎక్జాస్ట్ షీల్డ్ మీద కార్బన్ ఫైబర్
రెట్రో స్టైల్డ్ హోండా వింగ్
1000ఆర్, రెండు క్యాన్స్ ఉంటాయి.

ఎప్రిల్ నుంచి గ్లోబల్ అమ్మకాలు మొదలవుతాయి.