మెయిన్ డ్రాకు సౌరభ్
హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ తొలి రోజు పోటీల్లో ఇండియాకు మంచి ప్రారంభం దొరికింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప జోడీ సెకండ్ రౌండ్ చేరింది. మంగళవారం జరిగిన ఫస్ట్ రౌండ్‌లో ఈ జంట 16–21, 21–19, 21–19తో థాయ్‌లాండ్‌కు చెందిన నిపిథ్ఫోన్– సావిట్రీ అమిత్రపాయ్ జంటపై గెలిచింది. మరో మ్యాచ్‌లో ప్రణవ్–సిక్కిరెడ్డి జోడీ 10–21, 18–21తో మూడో సీడ్ దిచాపోల్–సాప్‌సైరి ( థాయ్‌లాండ్) జంట చేతిలోఓడింది. యువ షట్లర్ సౌరభ్ వర్మ సింగిల్స్‌లో మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ రౌండ్ తొలి మ్యాచ్‌లో 21– 15, 21–19తో తనోన్గ్‌సక్(థాయిలాండ్)పై నెగ్గిన సౌరభ్ తర్వాతి మ్యాచ్‌లో 21–19, 21–19తో లూకస్ క్లేర్‌బౌట్(ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.
శ్రీకాంత్‌కు వాకోవర్
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో తన ప్రత్యర్థి ,వరల్డ్ నంబర్ వన్ కెంటో మొమోటా తప్పుకోవడంతో శ్రీకాంత్‌కు ఫస్ట్ రౌండ్‌లో వాకోవర్ లభించింది. సాయి ప్రణీత్, కశ్యప్, సైనా, సింధు తదితర స్టార్లు బుధవారం తమ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడనున్నారు.


