KKR vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఏకనా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్ బౌలింగ్ తీసుకోవడంతో.. మొదట బ్యాటింగ్ కి వచ్చిన కేకేఆర్ ని కట్టుడి చేశారు. లక్నో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో కోల్‌కతా బ్యాటర్లను బెంబేలెత్తించారు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది.. ముఖ్యంగా లక్నో పేసర్ మొహిసిన్ ఖాన్ అద్భుత బౌలింగ్ చేయడంతో కోల్‌కతా నడ్డి విరిచాడు.
ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే టైమ్ సీఫెర్ట్ (0)ని అవుట్ చేసి మొహిసిన్ తొలి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత అజింక్య రహానే (10) నిలకడగా ఆడే ప్రయత్నం చేసిన తర్వాత మొహిసిన్ బౌలింగ్‌లోనే మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా రోవ్‌మన్ పావెల్ (1) కూడా 6.1 ఓవర్ వద్ద మొహిసిన్ వేసిన బంతిని పుల్ చేసే క్రమంలో పావెల్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇక మంచి ఊపుమీద కనిపించిన అంగ్‌క్రిష్ రఘువంశీ (9) కూడా స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మొహిసిన్ ఖాన్ 3 వికెట్లతో చెలరేగగా, మహమ్మద్ షమీ, దిగ్వేష్ రాఠీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్ ఉన్నారు. వీరిద్దరూ జట్టును ఏ మేరకు ఆదుకుంటారో అనేది వేచి చూడాలి. 9 ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 వికెట్ల నష్టానికి కేవలం 59 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సీజన్‌లో ఇప్పటికే తడబడుతున్న కేకేఆర్‌కు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకంగా మారింది.
Running through the opposition’s top order 🔥
— IndianPremierLeague (@IPL) April 26, 2026
🎥 Mohsin Khan denting #KKR not once but thrice in his first spell 👊
Updates ▶️ https://t.co/elFxwvCeWO#TATAIPL | #KhelBindaas | #LSGvKKR | @LucknowIPL pic.twitter.com/p2ciREZ6K7

