శివాజీ మహారాజ్ పై బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ ఇష్యూపై మహారాష్ట్ర భగ్గుమంటోంది. కామన్ మ్యాన్ నుంచి పొలిటీషయన్స్ వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునివ్వటం వివాదం మరింత ముదిరింది. అయితే ఈ వివాదంపై సినీ హీరో రితేశ్ దేశ్ ముఖ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రితేశ్ ఇంత ఘాటుగా ఇదివరకు స్పందించి ఉండరు అంటున్నారు.
- ఏంటి వివాదం..?
మహారాష్ట్ర నాగ్ పూర్ లో భారత్ దుర్గ శక్తి స్థల్ శంకుస్థాపన సందర్భంగా బాగేశ్వర్ బాబా అని పాపులర్ అయిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధాలు చేసి చేసి అలసి పోయి.. తన రాజ్యాన్ని, కిరీటాన్ని ఆధ్యాత్మిక గురువు సమర్థ్ రామదాస్ కు ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాడు.
ఇండియాలో ప్రజలు సమాన్యంగా ఏదైనా విపత్తు సంభవిస్తే, ఆపద సమయంలో పారిపోతారు.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడతారు.. కానీ ఆర్ఎస్ఎస్ లో ఉండే ప్రతి కార్యకర్త ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తాడని అన్నారు. భారతీయులు ప్రతిఒక్కరు నలుగురు పిల్లలను కనాలి.. ఒకరిని ఆర్ఎస్ఎస్ కు డొనేట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ వాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
ఈ వ్యాఖ్యలపై సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ.. చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా ఇలాంటి ఉదాహరణలు లేవు. మహనీయులకు సంబంధించిన విషయాలు భిన్న రూపాలకు సంతరించుకుంటాయి.. రామాయణ, మహాభారతాల్లాగే. అయితే ఎవరైనా మహానీయుల గురించి మాట్లాడే ముందు వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలన్నారు.
- రితేశ్ దేశ్ ముఖ్ కామెంట్స్:
బాగేశ్వర్ బాబా వ్యాఖ్యలను నటుడు రితేశ్ దేశ్ ముఖ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భక్తుడిగా, అభిమానిగా రితేశ్ తన ఇలా కామెంట్ చేశారు. ఎవరైనా వచ్చి మన ఆరాధ్య దైవం గురించి వక్రీకరించినా.. అర్థంలేని మాటలు మాట్లాడినా, ఒక శివప్రేమిగా, శివభక్తుడిగా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. బాబా మాటలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఛత్రపతి లెగసీని అవమానించటమే. ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలను ఏమాత్రం సహించబోము.. అంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.
సహ్యాద్రి పర్వత శ్రేణులు కోట్లాది సంవత్సరాలుగా ఎలా నిలిచి ఉన్నాయో, అలాగే ఆ ఒక్క నామం కూడా భవిష్యత్తులో కోట్లాది సంవత్సరాల పాటు నిలిచి ఉంటుంది. ఆ నామమే క్షత్రియ వంశోద్భవుడు, సింహాసనాధీశ్వరుడు, చక్రవర్తులకు చక్రవర్తి అయిన ఛత్రపతి మహారాజ్ అంటూ తన అభిమానాన్ని పంచుకోవడమే కాకుండా.. బాబాకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. రితేష్ ప్రస్తుతం శివాజీ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

