హిమాయత్ సాగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణాలు బలి తీసుకుంది. ఆదివారం ( ఏప్రిల్ 26 ) వీకెండ్ కావడంతో హైదరాబాద్ లోని టోలిచౌకి నుండి హిమాయత్ సాగర్ కు ఈత కోసం వెళ్లారు ముగ్గురు యువకులు. సరదాగా హిమాయత్ సాగర్ లో చేపలు పడుతూ నీటిలోకి దిగారు స్నేహితులు. ఈత కొడుతూ ఒక్కసారిగా నీటలో గలంతయ్యారు యువకులు.ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా..మరో యువకుడు ప్రాణులతో బయటపడ్డాడు.
ఈ ఘటనతో యువకుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు టోలిచౌకి ప్రాంతానికి చెంది షేక్ సల్మాన్, షాబాజ్ గా గుర్తించారు. ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ మరో యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

