కుక్కలకు తిండి పెట్టిందని లక్షల్లో ఫైన్

కుక్కలకు తిండి పెట్టిందని లక్షల్లో ఫైన్

ఓ ఇంటి ఓనర్ కు హౌసింగ్ సొసైటీ ₹3.6 లక్షలజరిమానా వేసింది. చేసిన నేరం.. కుక్కలకు తిండి పెట్టడం! అవును, ముంబైలోని కాంది విలీలోజరిగిందీ ఘటన. నేహా దాత్వాని అనే మహిళ దనిసర్గ్​ హెవెన్ సొసైటీ (ఎన్ హెచ్ ఎస్ )లో ఉంటోంది.ఆమె సొసై టీలోపల వీధి కుక్కలకు ఫుడ్డు పెట్టింది.అయితే, అలా సొసైటీ పరిసరాల్లో వీధి కుక్కలకు తిండి పెట్టడాన్ని నిషేధిస్తూ సొసైటీ వాళ్లు తీర్మానించారు. దీంతో ఆమెకు జరిమానా వేశారు సొసై టీచైర్మన్ మితేశ్ బోరా.‘98 శాతం మంది ఈ తీర్మానానికి ఒప్పుకున్నారు. సొసై టీ చైర్మన్ గా అందరూరూల్స్ పాటించేలా చూడడం నా బాధ్యత. అందుకేఫైన్ వేశా. సొసైటీ సభ్యులు కుక్కలకు తిండి పెడితే మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే సొసై టీ పరిసరాల్లో మాత్రం పెట్టొద్దు . మేమూ జంతు ప్రేమికులమే.జంతు హక్కులు ఓకేగానీ, మరి మానవ హక్కులమాటేంటి?” అని బోరా ప్రశ్నించారు. ముసలోళ్లు,పిల్లలపైకి ఆ కుక్కలు దాడి చేసేందుకు వస్తున్నాయన్నా రు. అంతేగాకుండా సొసైటీ పరిసరాలను ఆకుక్కలు పాడుచేస్తున్నాయన్నా రు. సొసైటీ సభ్యుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చిన తర్వాతే ఈరూల్స్ పెట్టామని చెప్పారు.

మార్చి దాకా ₹3.6లక్ష ల మెయింటెనెన్స్ వేశారని నేహా దాత్వాని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలకు తిండిపెట్టానన్న కారణంతో నెలకు ₹75 వేల ఫైన్ వేశారని, ఇదెక్కడి న్యాయం అని ఆమె ప్రశ్నించా రు. గత ఏడాదిజూలైలో 2500 ఫైన్ వేసిన సొసైటీ.. ఒక్క నెలలోనే₹75 వేలకు పెంచేసిందన్నారు. కేతన్ షా అనే వ్యక్తికీ జూలైలో ₹7,500 జరిమానా వేశారన్నారు. ఆతర్వాత ఆయనకూ తన పరిస్థితే ఎదురైందన్నా రు.జంతు హక్కుల కార్యకర్తలను కలిశాక నవంబర్ లోఫైన్ వేయడం మానేశారని, మళ్లీ ఇప్పుడు కొత్తగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. తొందర్లోనే సిటీ నుంచి దూరంగా వెళ్లిపోతానన్నా రు. డ్యూస్ అన్ని క్లియర్ చేసి వెళతానని, అమ్మా, చెల్లి అక్కడే ఉంటారని చెప్పారు. ఒక్కపైసా ఫైన్‌‌ కట్టనన్నారు.