షుగర్​ తగ్గించే గుమ్మడి గింజలు

షుగర్​ తగ్గించే గుమ్మడి గింజలు

డయాబెటిస్‌‌ ఉన్నవాళ్లు షుగర్‌‌‌‌ లెవల్స్‌‌ తగ్గించుకోవడం చాలాముఖ్యం. షుగర్‌‌‌‌ తగ్గడానికి ఎప్పుడూ మందులపైనే ఆధారపడకుండా,  డైట్‌‌తో కూడా తగ్గించుకోవచ్చు. అందుకు చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అందులో గుమ్మడి గింజలు ఒకటి. వీటిలోని మినరల్స్, ఫైబర్‌‌‌‌, విటమిన్‌‌ కె, ఎ, ఇలు  రోగాలబారిన పడకుండా కాపాడతాయి. 

 

  • గుమ్మడి గింజలు తింటే, శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకల్ని గట్టి పరుస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు  ఫ్రీ రాడికల్స్‌‌ను తగ్గిస్తాయి.  
  • డయాబెటిస్‌‌ ఉన్నవాళ్లు గుమ్మడి గింజలను శ్నాక్‌‌లా తినొచ్చు.  ఇవి ఇన్సులిన్‌‌ను బ్యాలెన్స్ చేస్తాయి. ఆక్సిడేషన్‌‌ వల్ల వచ్చే హైపర్‌‌‌‌ టెన్షన్‌‌ని కూడా తగ్గిస్తాయి. గుమ్మడి గింజల్ని వేగించి తినొచ్చు లేదా సలాడ్‌‌ల్లో కూడా వాడుకోవచ్చు
  •  వీటిలోని  ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు.  ఆకలి అదుపులో ఉంటుంది. దాంతో బరువు తగ్గొచ్చు.
  •  కడుపు, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్‌‌, పేగు క్యాన్సర్ల ముప్పుని కొంతవరకు తగ్గించుకోవచ్చు.   
  •  ఈ గింజల్లోని మెగ్నీషియం‌‌ బ్లడ్ ప్రెజర్‌‌‌‌ని తగ్గిస్తుంది.  వీటిలో ఉండే ట్రిప్టోఫేన్‌‌ నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రపోయే ముందు నాలుగు గుమ్మడి  గింజలు నోట్లో వేసుకుని నమిలినా మంచి నిద్ర పడుతుంది.