హైదరాబాద్, వెలుగు: సిటీలో టేస్టీ ఫుడ్‌కు ఢోకా ఉండదు. ఒక రకంగా సిటీ ఫుడ్ హబ్ కూడా. ఓరియెంటల్ ఫుడ్ నుంచి కాంటినెంటల్ వరకు, ఫైవ్ స్టార్ నుంచి స్ట్రీట్ ఫుడ్ దాకా.. లోకల్ ఫుడ్ నుంచి ఇతర రాష్ట్రాల అథెంటిక్ ఫుడ్దాకా.. ఇరానీ చాయ్ నుంచి స్టార్ బక్స్ కాఫీ దాకా దొరకనిదంటూ లేదు. ఇలాంటి చిన్నా, పెద్దా హోట
ళ్లకు, ఫుడ్ స్టాల్స్‌కు, కెఫేలకు అడ్డా హైదారాబాద్ సిటీ. అయితే ఇంత పెద్ద సిటీలో రుచికరమైన టేస్ట్ ఉండే ఫుడ్, అట్రాక్టివ్ ఆంబియన్స్‌తో ఆకట్టుకుంటూ..
లంచ్, డిన్నర్‌ను మరింత రుచిగా వడ్డించే హోటళ్లు ఎక్కడున్నాయి? వాటి మెనూ ఏంటి, రేటు అందుబాటులో ఉందా?.. ఈ వివరాలు ఎలా తెలియాలి? ఇలాంటి పనే ఫుడ్ వ్లాగర్స్ చేస్తున్నారు. ఫుడ్ ఎక్స్‌ప్లోరింగ్ బ్లాగ్‌లో సోషల్ మీడియాతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. కచ్చితమైన రివ్యూ, డీటెయిల్స్‌తో ఫుడ్ బ్లాగ్స్ అందుబాటులోకి వచ్చాక ఫుడ్డీస్ వాటిని విపరీతంగా ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు చాలామంది తాము టేస్ట్ చేసిన కొత్త రుచులను వీడియోలు, ఫొటోలు తీసి తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు వందలమంది దీన్నే ప్రొఫెషన్‌గా మార్చేసుకుంటున్నారు. నయా టేస్ట్‌ని ఎక్స్‌ఫ్లోర్ చేయడమే వీళ్ల పని. దీంతో చాలామంది ఎక్కడేం దొరుకుతుందో ఈజీగా తెలుసుకోగలుగుతున్నారు.
సోషల్ మీడియా యాప్స్‌లో..
టేస్టీ డ్రిప్స్, ఫుడ్ విత్ భావ్నా, ఫుడ్ డిక్టెటివ్, ఫుడ్ స్టర్స్ హబ్ ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఓపెన్ చేస్తే వందల్లో ఫుడ్ రిలేటెడ్ పేజ్‌లు కనిపిస్తాయి. ఫుడ్‌ను ఇష్టపడే చాలామంది ఫుడ్ రివ్యూవర్లుగా సోషల్ మీడియాలో తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. స్ట్రీట్ ఫుడ్ నుంచి స్టార్ హోటల్ ఫుడ్ వరకూ అన్నింటిపై రివ్యూలను ఇస్తున్నారు. వీటిని వీడియోల ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఫుడ్ లవర్స్‌కు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఏరియా, ల్యాండ్‌మార్క్, ఆంబియన్స్, ఫుడ్ వెరైటీలు, వాటి రేట్లు, రుచి చూసి వీటన్నింటికి కలిపి రేటింగ్ కూడా ఇస్తున్నారు.
ఈ పేజ్‌లు మెయింటెన్ చేస్తున్న వారిలో అమ్మా యిలు, అబ్బాయిలు ఉంటున్నారు. ఫుడ్ ఐటమ్స్ తింటూ వాటికి ఆకట్టుకునే వాయిస్ ఓవర్లు కూడా ఇస్తున్నారు. ‘సిటీలో వేలసంఖ్యలో ఫుడ్ స్పాట్‌లున్నా వెళ్లాలంటే ఏ ప్లేస్ సెలక్ట్ చేసుకోవాలో చిన్న కన్ఫ్యూజన్. కొత్త ప్లేస్ కు వెళ్తే అక్కడ టేస్ట్, రేటు ఎలా ఉంటుందో అని చాలామంది తెలిసిన హోటళ్లకే వెళ్తుంటారు. అయితే ఈ కొత్త ట్రెండ్ అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఎలాంటివి అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం ఈజీ అయింది’ అని మాదాపూర్‌కు చెందిన శ్రావణి చెబుతోంది.
ఫేస్బుక్లో గ్రూప్స్..
ఫుడ్ వ్లాగర్స్ కే కాకుండా.. భోజన ప్రియులకు కూడా ఫేస్బుక్లో గ్రూప్స్ ఉన్నాయి. హోటల్, కెఫేల్లో ఫుడ్ టేస్ట్ చేసి దానిపై ఒపీనియన్స్‌ను షేర్ చేసుకుంటున్నారు. ఈ ఫేస్బుక్ పబ్లిక్ గ్రూప్స్‌లో డిస్కషన్ మొత్తం ఫుడ్ గురించే ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో టేస్ట్ చేసిన ఫుడ్, హోటల్ గురించి, వాటిపై రివ్యూలను పోస్ట్ చేస్తుంటారు. నెగెటివ్ ఒపీనియన్స్ కూడా ఈ గ్రూపుల్లో ఉంటాయి. ఫుడ్ టేస్ట్‌గా లేకపోతే ‘బాగాలేదు’ అని ఇతరులను అలర్ట్ చేస్తారు. ఇలా పాజిటివ్, నెగెటివ్ రివ్యూలతో ఫేస్ బుక్‌లో పబ్లిక్ గ్రూప్‌లు అందుబాటులో ఉన్నాయి.
కొత్త ప్లేస్‌ను ఎక్స్ ప్లోర్ చేస్తున్నం
ఫ్రెండ్స్ అందరం డిన్నర్, లంచ్ చేయాలంటే ఎప్పుడూ మాల్స్‌లోని రెస్టారెంట్లు, మండీలకే వెళ్లేవాళ్లం. వేరే రెస్టారెంట్లకు వెళ్దామన్నా కాస్ట్, టేస్ట్ విషయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక పాతవాటికే ఇంట్రెస్ట్ చూపేవాళ్లం. కానీ మేముంటున్న ఏరియాలో తక్కువ ధరలో టేస్టీ ఫుడ్ దొరికే ప్లేసులు చాలా ఉన్నాయని ఫుడ్ వ్లాగర్ పేజ్ద్వారా తెలుసుకున్నాం. అందుకే ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక కొత్త ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం.
- రాజేశ్వరి,
ప్రైవేటు ఎంప్లాయ్, కొండాపూర్వీడియోస్ చూసి..
తక్కువ కాస్ట్‌లో అన్నిరకాల వెజ్ ఐటమ్స్‌తో కొండాపూర్‌లో ఓ బఫే రెస్టారెంట్ ఉందని వ్లాగర్స్ ద్వారా తెలుసుకున్నా. మా పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీకి అక్కడికి వెళ్లి డిన్నర్ చేశాం. టేస్ట్ బాగుంది.
- బాలు, ఐటీ ఎంప్లాయ్,సికింద్రాబాద్

