మానవ వనరుల శాఖ పేరు మార్చిన కేంద్ర కేబినెట్

మానవ వనరుల శాఖ పేరు మార్చిన కేంద్ర కేబినెట్

కేంద్రం మానవ వనరుల శాఖ పేరును… విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇస్రో మాజీ చీఫ్‌ కే కస్తూరి రంగన్‌ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ మొదట మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని సిఫార్సు చేసింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్‌లో ఇది కీలక సిఫార్సు కావడంతో పేరు మార్పునకు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.