బషీర్‌బాగ్, వెలుగు: డాక్టర్ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్రమాత్రలు, దగ్గు సిరప్‌లను అక్రమంగా విక్రయిస్తున్న మల్లెపల్లికి చెందిన మహమ్మద్ సర్వర్, మహమ్మద్ రబ్బానీలను హైదరాబాద్ సీసీఎస్, హబీబ్‌నగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
పక్కా సమాచారంతో మాంగర్ బస్తీలోని ఓ ఇంటిపై దాడి చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 77,700 నిద్రమాత్రలు, 170 చాకో దగ్గు సిరప్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వీటిని కర్ణాటకలోని బీదర్ నుంచి తెచ్చి, మత్తుకు బానిసలైన యువతకు, నేరస్థులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో మల్లెపల్లికి చెందిన జమ్ము భాయ్, మహదరి, వీర్దరి, ఎచ్చదరి, బీదర్ కు చెందిన అమన్‌లాల్, కోహినూర్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
