మేజర్ చిత్రానికికి అశేష స్పందన

మేజర్ చిత్రానికికి అశేష స్పందన

తన విలక్షణ నటనతో టాలీవుడ్ లో సత్తా చాటుకుంటున్న యంగ్ హీరో అడవి శేషు తాజాగా నటించిన చిత్రం మేజర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటీవలే రిలీజై విశేష స్పందనను సొంతం చేసుకుంటోంది. ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తూ, ఆద్యంతం ఇంట్రస్టింగ్ గా సాగిన ఈ చిత్రాన్ని చూసినవారందరూ అద్భుతం అనే పదాన్ని వాడకుండా ఉండలేకపోతున్నారు. ఈ మూవీపై సామాన్య ప్రేక్షకుడే కాదు, సినీ సెలబ్రెటీలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్సే కాదు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ  చిత్రంపై  ట్వీట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషల్ ప్రొడక్షన్స్, మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన మేజర్ సినిమా అన్ని తరాల ప్రేక్షకులూ తప్పక చూడాల్సిన సినిమా అని పలువురు అంటున్నారు.

మరిన్ని వివరాల కోసం...

కర్ణాటక ఆరోగ్య మంత్రికి కొవిడ్ పాజిటివ్

"మంజుబా ను రసోడు" ఫుడ్‌‌ ట్రక్‌‌