
హైదరాబాద్: సమాజం ఎటు పోతుంది.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారా.. ఎంత నీచమైనా పనులైనా చేస్తారా.. ఇప్పటి వరకు డబ్బుల కోసం గొడవలు, మర్డర్లు జరగడం చూశాం. కానీ ఓ జంట ఏకంగా శీలాన్ని తాకట్టు పెట్టింది. డబ్బుల కోసం సభ్యసమాజం తలదించుకునే విధంగా తమ నగ్న వీడియోలను ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టి గలీజ్ దందాకు తెరలేపింది. ఇంట్లో నగ్న వీడియోలు రికార్డ్ చేసి వాటిని ఆన్ లైన్లో డబ్బులకు అమ్ముతున్నారు. డబ్బులు ఎక్కువ ఇచ్చిన వారికి ఏకంగా లైవ్ లింక్ పంపుతున్నారు. ఈ నీచపు ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని అంబర్ పేట్లో వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. అంబర్పేట్లో ఓ జంట ఇంట్లో నగ్న వీడియోలు చిత్రీకరించి ఆన్ లైన్లో అమ్ముకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి రికార్డ్ చేసిన వీడియోలు పంపుతున్నారు. డబ్బులు ఇంకా ఎక్కువ ఇచ్చిన వారికి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పోలీసులకు తెలిసింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్ ప్రకారం నగ్న వీడియోలు చిత్రీకరిస్తోన్న ఇంటిపై దాడులు చేశారు. ఇంట్లో సెర్చ్ చేసి కెమెరా, లైవ్ లింక్ పరికరాలను స్వాధీనం చేసుకుని దంపతులను అరెస్ట్ చేశారు. సెక్స్ వర్కర్ల దంపతులపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరిని అంబర్ పేట్ పోలీసులకు అప్పగించారు. గత 4 నెలలుగా ఈ దందా సాగుతోన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.