పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న నర్సయ్య సైబర్‌నేరగాళ్ల బారిన పడి మోసపోయాడు. ఆర్టీఏ చలాన్ పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.49,139 డెబిట్అయ్యాయి.
ఈ నెల 8న ఫోన్‌కు వరుసగా మెసేజ్‌లు వచ్చాయి. దీంతో తన అకౌంట్‌ను చెక్‌చేసుకోగా డబ్బులు కట్ అవుతున్నట్లు గుర్తించి షాక్‌కు గురయ్యాడు. తనకు తెలియకుండా లావాదేవీలు జరుగుతుండటంతో వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
