కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రాజాసింగ్

కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రాజాసింగ్

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇవాళ ఉదయమే ఆయన రాజాసింగ్ ఇంటికి వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. రాజాసింగ్ అప్ లోడ్ చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో నిన్న రాత్రి నుంచి ఓ వర్గం వారు పోలీసు కమిషనర్ కార్యాలయంతో పాటు భవానీ నగర్, డబీరపురా, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో మొహరించి ఆందోళనకారులను అదుపు తప్పకుండా చేశారు. అయితే ఫిర్యాదులు కూడా అందడంతో వెంటనే రాజాసింగ్ ఇంటికెళ్లి అరెస్టు చేసి తీసుకెళ్లారు. రాజాసింగ్ ను బొల్లారం పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.. కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. 

రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ పై అధిష్టానం వేటు వేసింది. బీజేపీ నుంచి రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది.