న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు రెడీ అయిన హైదరాబాద్ 

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు రెడీ అయిన హైదరాబాద్ 

ఇయర్ ఎండ్ పార్టీలకు రెడీ అయింది హైదరాబాద్. పబ్బులు, రిసార్టుల్లో ఆఫర్లతో ఈవెంట్స్ ని ఏర్పాటు చేశారు ఆర్గనైజర్లు. కార్పొరేట్ బుకింగ్స్, ఫ్యామిలీ పార్టీ,  క్రౌడ్ లౌడ్, గేటెడ్ పార్టీల పేరుతో రకరకాల ఈవెంట్స్ జరుపుతున్నారు. నగరంలోని పబ్బుల్లో బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. అలాగే నగర శివార్లలోని ఫామ్ హౌజ్ లు, రిసార్టుల్లో సెలబ్రేషన్స్ జరుపుతున్నారు.

శనివారం రాత్రి జరిగే వేడుకల కోసం ఈవెంట్ ఆర్గనైజర్స్ అరెంజ్ మెంట్స్ పూర్తి చేశారు. వెజ్, నాన్ వెజ్ తో.. అన్ లిమిటెడ్ ఫుడ్, అన్ లిమిటెడ్ లిక్కర్ తో.. ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి.. పబ్లిక్ ను అట్రాక్ట్ చేస్తున్నారు.