మలక్‌పేట్ సీఐ నరసింహను సస్పెండ్ చేసిన హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్

మలక్‌పేట్ సీఐ నరసింహను సస్పెండ్ చేసిన హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్

హైదరాబాద్: విధి నిర్వహణలో అలసత్వం, అధికార దుర్వినియోగం ఆరోపణలపై మలక్‌పేట్ సీఐ నరసింహను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సస్పెండ్ చేశారు. మలక్‌పేట్ సీఐగా బాధ్యతలు చేపట్టే ముందు సుల్తాన్‌బజార్ సీఐగా పనిచేసిన సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు నరసింహపై ఉన్నాయి.

అలాగే ఓ మహిళా కానిస్టేబుల్ ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన వేధింపుల కేసు, భార్యతో విడాకుల వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే మరో మహిళను వివాహం చేసుకుని కుమారుడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

విచారణ నివేదికను కమిషనర్‌కు సమర్పించగా, అందులోని అంశాల ఆధారంగా సీఐ నరసింహను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.