నిజమైన మిత్రుడు పుస్తకమే: బండారు దత్తాత్రేయ

నిజమైన మిత్రుడు పుస్తకమే: బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్, వెలుగు: నిజమైన మిత్రుడు మంచి పుస్తకమేనని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఒకసారి పుస్తకం కొంటే ఎన్ని ఏండ్లయినా అలానే ఉంటుందని, ఎప్పుడైనా చదువుకోవడానికి వీలుంటుందన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటైన హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌‌‌‌ను సోమవారం సాయంత్రం దత్తాత్రేయ సందర్శించారు. పలు స్టాల్స్‌‌లో ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుస్తకం చదవడం విజ్ఞాన వికాసానికి, వ్యక్తిత్వానికి చాలా అవసరమన్నారు.  రామాయణం, మహాభారతం మన దేశానికి గొప్ప సందేశాలను ఇస్తున్నాయని..  వాటిని చదివి ఆచరించాలని కోరారు. దత్తాత్రేయ వెంట బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ ఉన్నారు. బుక్ ఫెయిర్​లో కాలేజీ స్టూడెంట్ల ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది.