ఫార్మసీ విద్యార్థిని కేసు.. పోలీసుల అదుపులో నిందితులు

ఫార్మసీ విద్యార్థిని కేసు.. పోలీసుల అదుపులో నిందితులు

హైదరాబాద్ లో సంచలనం రేపిన ఫార్మసీ విద్యార్థిని కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడైన రాజుకు మరో ముగ్గురు సహకరించినట్లు గుర్తించారు. యువతికి రాజు ముందే తెలుసని విచారణలో తేలినట్లు సమాచారం. రోజూలాగే అతని ఆటో ఎక్కినట్లు చెప్తున్నారు. మిగితా ముగ్గురు నాదం శివ, రమేష్, భాస్కర్ లుగా గుర్తించారు. వీరంతా ఒకే ఊరు వాళ్లు.. అంతా ఆటో డ్రైవర్లే. అందరి వయసు 25 నుంచి 30 ఏళ్లలోపు ఉంటుందని తెలుస్తోంది. నాగారం సర్కిల్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు… సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నారు. నిన్న రాత్రి 11 గంటలకే నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు… భువనగిరి ఎస్వోటీలో రహస్యంగా విచారించినట్లు తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలి శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం అందింది.  ఘటనపై కీసర పిఎస్ లో కిడ్నాప్, రేప్, బెదిరింపులు తో పాటు నిర్భయ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.